![]() |
![]() |

సునీత ఈమె గురుంచి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అద్భుతమైన సింగర్ మాత్రమే కాదు మంచి అందాల రాశి కూడా. మాట్లాడితే ముత్యాల రాలతాయా అన్నట్టు ఉంటుంది ఈమె మాట. సునీత సాంగ్స్ కి కానీ ఆమె ఆటిట్యూడ్ కి కానీ చాలామంది ఫాన్స్ కూడా ఉన్నారు. ఈమె సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉంటూ తన విషయాలన్నీ షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఈమె తన కూతురితో దిగిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
తన కూతురు శ్రేయ పుట్టినరోజును పురస్కరించుకుని " శ్రేయా నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. నీది మంచి మనసు. నువ్వు నిలువెత్తు అందానివి. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ..నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు " అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సునీత గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. గులాబీ, ఎగిరే పావురమా మూవీస్ లో పాడిన పాటలకు సునీతకు మంచి గుర్తింపు వచ్చింది. పాటలు పాడడమే కాదు. ఈమె డబ్బింగ్ కూడా చెప్తారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫొటోస్ అప్లోడ్ చేస్తూ నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తూ ఉంటారు. సునీత జీవితంలో ఎన్నో కష్టాలనెదుర్కొని తన కాళ్ళ మీద తాను నిలదొక్కుకుంది. ఇక ఇప్పుడు తన భర్త బిజినెస్ కి సహకరిస్తూ, అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో పాటలు పాడుతూ, రియాలిటీ షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |